పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 830 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి
అందులో వ్యర్థాలుగా మారిన మొత్తం 630 కోట్ల మెట్రిక్‌ టన్నులు

ప్రపంచవ్యాప్తంగా 1950ల్లో భారీఎత్తున కృత్రిమ పదార్థాల ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి మానవాళి 830 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసినట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అందులో అత్యధిక మొత్తం ప్రస్తుతం వ్యర్థాలుగా మారి.. పర్యావరణానికి హానికరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి, పునర్వినియోగానికి అనుకూలంగా దాని వ్యర్థాలను తిరిగి మల్చడం(రీసైక్లింగ్‌) వంటి అంశాలపై జార్జియా విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బారా-సముద్ర అధ్యయన సంఘం పరిశోధకుల బృందం తాజా అధ్యయనాన్ని నిర్వహించింది. 1950ల నుంచి 2015 వరకు మానవాళి 830 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో 630 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఇప్పటికే వ్యర్థాలుగా మారిందని వెల్లడించారు.ఈ మొత్తంలో కేవలం 9 శాతాన్ని పునర్వినియోనికి వీలుగా మార్చినట్లు తెలిపారు. 12 శాతం వ్యర్థాన్ని భస్మం చేశారని, మిగిలిన 79 శాతం భూమిలోకి చేరిందని వెల్లడించారు. ప్రస్తుత ఒరవడి కొనసాగితే.. 2050 కల్లా దాదాపు 1200 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలోకి చేరుతాయని అంచనా వేశారు. మొత్తం ప్లాస్టిక్‌లో దాదాపు సగభాగం.. 2002 తర్వాతే ఉత్పత్తయిందని వెల్లడించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *