‘చెత్త’ కబుర్లు

ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాల్ని తీసుకెళ్లేందుకు చెత్తవ్యాను వరుసగా నాలుగు రోజులు రాకపోతేనే తెగ ఇబ్బంది పడిపోతాం. మరి, భూమంతా చెత్తతో నిండిపోతే మన తరవాతి తరాల పరిస్థితి ఏంటి… వారసుల కోసం మనం విలువైన సంపదనూ ఆస్తుల్నీ కూడబెట్టినట్లే వాళ్లకి బతుకేలేకుండా చేసేంత చెత్తను కూడా కూడబెడుతున్నామని మీకు తెలుసా…

సగటున ఏడాదికి ఒక్కో వ్యక్తీ ఉత్పత్తి చేసే చెత్త 271 కిలోల పైనే. మనదేశంలోని పట్టణాలూ నగరాల్లో ఉండే దాదాపు 38కోట్ల జనాభా నుంచీ ఇతర పరిశ్రమల నుంచీ సంవత్సరానికి పోగయ్యే చెత్త అక్షరాలా ఆరుకోట్ల టన్నులని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికలు చెబుతున్నాయి. దీన్లో 4.5 కోట్ల టన్నుల (సుమారు ముప్ఫైలక్షల ట్రక్కుల) చెత్తను రీసైకిల్‌ చెయ్యకుండా ఎక్కడో ఓచోట పారబోసేస్తున్నాం. ఆ ట్రక్కులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేర్చితే ఎంత పొడవుంటుందో తెలుసా… భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరంలో సగాన్ని చేరుకున్నంత. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అతి ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ది మూడోస్థానం. మొదటి, రెండో స్థానాల్లో చైనా, అమెరికాలున్నాయి. మరి, ఆ చెత్తంతా మట్టిలో ఎప్పటికి కలిసిపోతుందీ అంటే… కొన్ని రకాల చెత్తకు వందల ఏళ్లు పడితే మరికొన్ని రకాలది కలవడానికి లక్షల సంవత్సరాలు కూడా పడుతుంది. మరి, మీరు వాడి పడేసే వస్తువుల్లో ఏది ఎంతకాలానికి మట్టిలో కలుస్తుందో ఓసారి చూడండి…

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *